13-01-2026 01:15:11 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జనవరి ౧౨ (విజయక్రాంతి): త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్టు కలెక్టర్ అభి లాష అభినవ్ తెలిపారు. సోమవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి లక్ష్మణ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల అభివృద్ధి ప్రభుత్వ అభివృద్ధి సంక్షే మ పథకాల అమలు తదితర అంశాలపై పలు సూచనలు చేశారని తెలిపారు.
నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాను పకడ్బందీగా రూపొందించాలని ఎన్ని కల సిబ్బందిపై పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టాలని ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మా ణం పనులను వేగంగా ముందుకు తీసుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిపారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆర్డిఓ రత్న కళ్యాణి డీఈవో భోజన తదితరులు ఉన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండండి
ఈనెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఆ శాఖ సమాచారాన్ని తెప్పించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. సోమవారం సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ఆయా శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ పనుల వివరాలు ప్రగతి నివేదిక నిధుల వినియోగం ఇతర అంశాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.
అనంతరం 2026 జిల్లా అభివృద్ధి అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ ఆర్డిఓ రత్న కళ్యాణి డిపిఆర్‌ఓ విష్ణువర్ధన్ సిపిఓ జీవరత్నం జెడ్పి సీఈవో శంకర్ అధికారులు ఉన్నారు.