13-01-2026 01:07:35 AM
ప్రాచీన ఆలయం... ఆదరణకు దూరం...
నేటి నుంచి సదల్పూర్ జంగి జాతర ప్రారంభం
ఆదిలాబాద్/బేల, జనవరి 12(విజయక్రాంతి): అదో ప్రాచీన ఆలయం.. అయినా ఆదరణకు మాత్రం నోచుకోని వైనం... వందల ఏళ్ల చరిత్ర గల శ్రీ బైరం దేవ్ మహాదేవ్ ఆలయం భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తోంది. ఆదివాసీల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. అటవీ ప్రాం తంలో హాల్లదకరమైన పచ్చని చెట్లు మధ్య శ్రీ బైరాం దేవ్ మహా దేవ్ లు కొలువైన ఆలయం అడవిలో ఉండటంతో జంగల్‌లో జాతరగా పేరు గాంచింది. బేల మండలంలోని సదల్పూ ర్ గ్రామ శివారులో గల అటవీ ప్రాంతంలోనీ శ్రీ బైరందేవ్ మహాదేవ్ ఆలయంలో ప్రతి ఏటా పుష్య మాసంలో జంగి జాతర వారం పాటు నిర్వహించడం అనవాయితీగా వస్తోం ది. మంగళవారం నుంచి జంగి జాతర ప్రారం భం కానుంది. జాతర కోసం ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈనెల 13 నుంచి 19వ తేదీ వరకు జాతర కొనసాగనుంది. కోరంగే వంశీయులు నవమి రోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి జారతను ప్రారంభిస్తారు. అమావాస్య రోజున దహిహండి కాలతో జాతర ముగుస్తోంది. జాతర సందర్భంగా 16వ తేదీన ఆదివాసీల సమస్యలపై దర్బార్ సభ నిర్వహించనున్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన శ్రీ బైరాం దేవ్, మహాదేవ్ ఆలయా లు శాతవాహనుల కాలంలో నల్లరాతితో నిర్మించారు. అందమైన శిల్పా సంపద ఆల య సొంతం. మనసులో ఏదైనా కోరుకొని బైరాం దేవ్ ఆలయంలోని లింగాన్ని ఎత్తితే జరిగే పని అయితే లింగం తేలికగా లేస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో నుండి ప్రజలు సైతం ఈ ఆల యాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆల యం చుట్టూ పచ్చని చెట్లుతో వాతావరణం భక్తులను మాయమరిపింప జేస్తాయి.