ఈవీఎంల గోదాముకు పటిష్ట భద్రత
* నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ మాదిరి ఇళ్ల పరిశీలన
* జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్, ఫిబ్రవరి 5 : జిల్లాలోని ఈవీఎంల గోదాము పట్టిష్టమైన భద్రత నడుము ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఈ.వి. యం గోదాము నెలవారీ తనిఖీలో భాగంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు తో కలిసి పరిశీలించారు. జిల్లా కేంద్రలోని ఈవీఎంల గోదాము పోలీసుల పర్యవే క్షణలో నిరంతర నిఘా లో ఉందన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గోదాం దగ్గర నిత్యం విధులు నిర్వహిస్తున్న పోలీసుల వివరాలు అడిగి రిజిస్టరు ను పరిశీలించారు. గోదాము వద్ద సీసీ కెమెరాలతో పర్యవేక్షణ గురించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసు కున్నారు.
ఇందిరమ్మ మోడల్ ఇల్లు పరిశీలన
రాష్ర్ట ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక మోడల్ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయాలని సూచించిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ మోడల్ హౌస్ ను కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు? అని ప్రశ్నించగా.. హౌసింగ్ డిఈ బదులిస్తూ 23జ20 విస్తీర్ణంలో, రూ. 5 లక్షల వ్యయంతో, సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.
కాగా మోడల్ హౌస్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాల విషయంపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జెడ్పి సీఈవో యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జడ్పీ డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్, హౌసింగ్ డిఇ విటోబా, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు.






