22-09-2025 04:49:30 PM
అనంతగిరి: మండలం ఖానాపురం వ్యవసాయ పరపతి సంఘంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు శ్రీనివాసరెడ్డి సహకారంతో రైతులకు యూరియా కొరత లేకుండా యూరియా పంపిణీ చేస్తు న్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ కోటేశ్వరరావు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ మండలంలోని ఖానాపురం రైతుసేవాకేంద్రాలలో ఒక్కో రైతు సేవాకేంద్రంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్కు శ్రీనివాసరెడ్డి సహకారంతో రైతు సోదరులకు యూరియా పంపిణీ చేశామన్నారు.
ఖానాపురం పరపతి సంఘంలో ఇప్పటివరకు యూరియా కొరత అనేదే లేదు యూరియా కొరత లేకుండా చేస్తున్నామని కోటేశ్వరరావు అన్నారు. యూరియా కొరత కేంద్రం వల్లనే ఏర్పడిందని తక్కువ స్టాకును పంపడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతుల ఇబ్బందులు తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ సహకారంతో యూరియాను ఎక్కువగా తెప్పించేందుకు కృషి చేస్తూ పంపిణీ చేస్తున్నామని అన్నారు