22-09-2025 05:47:13 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రజలకు ఏ సమస్య వచ్చినా జిల్లా పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పోలీసుల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. పోలీస్ శాఖ ప్రజలకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసులు పాల్గొన్నారు.