22-09-2025 05:48:25 PM
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ పాల్గొని ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవిస్తూ 157 వినతులను అందజేశారు.