22-09-2025 05:50:45 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ విద్యాపురంలో గల త్రిశక్తి క్షేత్రంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవార్లు బాలా త్రిపుర సుందరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లను గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద సంస్కృతి పరిషత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.