calender_icon.png 22 September, 2025 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టాల్లో ఉన్న చేనేత కార్మికులకు రుణమాఫీ చేయండి

22-09-2025 04:52:43 PM

- హామీ ఉన్న అమల్లో జాప్యం

- అప్పుల ఊబిలో ఉండి రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న చేనేత కార్మికులు

- చేనేత కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు చెరుకు సైదులు

మునుగోడు,(విజయక్రాంతి): రుణ మాఫీ పథకాన్ని అమలు చేసి కష్టాల్లో ఉన్న చేనేత కార్మికులకు ఉపశమనం కల్పించడానికి తక్షణమే చర్య తీసుకోవాలని చేనేత కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు చెరుకు సైదులు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో చేనేత కార్మికులకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. అయితే ఈ ప్రకటన ఉన్నప్పటికీ, చాలా మంది కార్మికులు ఇప్పటికీ తమ రుణాలు మాఫీ అవుతాయని ఎదురు చూస్తున్నారు. అప్పుల కారణంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉటంకిస్తూ, రుణమాఫీని వెంటనే అమలు చేయాలని అన్నారు.

ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ మొత్తాన్ని తమ ఖాతాల్లో జమ చేయాలని చేనేత కార్మికులు డిమాండ్ చేశారు.చేనేత కార్మికులకు 18,000 ,అనుబంధ కార్మికులకు 6,000 బీమా పతకంతో సహా బీమా ప్రయోజనాలను అమలు చేయాలని  కార్మికులు డిమాండ్ చేశారు.ఏప్రిల్ 1, 2017, నుండి మార్చి 31, 2024 మధ్య రుణాలు తీసుకున్న ప్రభుత్వం రుణ మాఫీ పథకాన్ని ఆమోదించింది దాని కోసం 33 కోట్లు రూపాయలతో నేత కార్మికులకు లక్ష రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కేటాయించింది అని అన్నారు.అమలు ఆలస్యం అయింది చాలా మంది కార్మికులు ఇప్పటికీ తమ రుణాలు మాఫీ చేయబడతాయని ఎదురు చూస్తున్నారు అని పేర్కొన్నారు.