30-10-2025 01:39:12 AM
-నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్
-ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా యశోద హాస్పిటల్స్ అవగాహన కార్యక్రమం
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి):బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం లక్షణాలను సకాలంలో గుర్తించి, తక్షణం వైద్య సహాయం అందిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని, శాశ్వత వైకల్యం బారిన పడ కుండా చూడవచ్చని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. ప్రపంచ స్ట్రోక్ డే ను పురస్కరించుకుని సికిందరాబాద్ యశోద హాస్పి టల్స్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, గత 30 ఏళ్లలో ఈ కేసుల సంఖ్య 51% పెరిగింది. ముఖ్యం గా వాయు కాలుష్యం, మారిన జీవనశైలి కారణంగా పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలోని యువతలో పక్షవాతం కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా దీని బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని సూచించారు.
యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్, డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ, బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలో మెకానికల్ థ్రాంబెక్టమీ అనే అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా మెదడులోని రక్తనాళాల్లో ఏర్పడిన గడ్డలను తొలగించి, రక్త ప్రసరణను పునరుద్ధరించవచ్చు. స్ట్రోక్ లక్షణాలు కనిపించిన 24 గంటల వరకు కూడా ఈ చికిత్సను అందించి, రోగిని వైక ల్యం నుంచి కాపాడి, సాధారణ జీవితం గడిపేలా చేయవచ్చు.
యశోద హాస్పిటల్స్ ఈ చికిత్సను అందించడంలో ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యూ రాలజిస్టులు డా. ఆర్.ఎన్. కోమల్ కుమార్, డా. శివరామ్‌రావు, సీనియర్ న్యూరో సర్జ న్లు డా. అయ్యాదురై, డా. కె.యస్. కిరణ్, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ యూని ట్ హెడ్ డా. విజయ్ కుమార్ పాల్గొన్నారు.