calender_icon.png 15 December, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓడిన గెలిచిన ప్రజల మధ్యలో ఉండాలి

15-12-2025 07:23:31 PM

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

ముత్తారం (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని ఎన్నికలలో గెలిచినా ఓడిన ప్రజల మధ్యలో ఉండి సేవలు అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. సోమవారం మండలంలోని పోతారం గ్రామ కాంగ్రెస్ నాయకులు మంత్రి శ్రీధర్ బాబును హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందిస్తూ గ్రామంలోని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి బండ సమ్మయ్య ఓటమి చెందగా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, గెలుపు ఓటములు సహజమని ప్రజల మధ్యలో ఉంటూ సేవలందించాలని సూచించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బండ సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు చెల్కల జితేందర్, శ్రావణ్, రమేష్, అనిల్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.