calender_icon.png 13 August, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

సీసీఎస్ రద్దు మహాధర్నాను విజయవంతం చేయాలి

13-08-2025 12:05:16 AM

పీఆర్‌టీయూటీటి ఎస్ జిల్లా అధ్యక్షులు అల్లాపుర్ కుశాల్ 

కామారెడ్డి, ఆగస్టు 12 (విజయ క్రాంతి): సెప్టెంబర్ 1 న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ పి ఆర్ టి యు టీఎస్ ఆధ్వర్యములో హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని పిటిఆర్టియూ జిల్లా అధ్యక్షులు అల్లాపూర్ కుశాల్ కోరారు. సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిందని, సిపిఎస్ రద్దు అయ్యేంత వరకు పి ఆర్ టి యు పోరాటం సాగిస్తుందని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సిపిఎస్ ను రద్దు చేసే ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఈ మద్యనే  కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మరియు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57 మెమో ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని వారు కోరారు.

సెప్టెంబర్ 1 న జరిగే ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నా కార్యక్రమానికి ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ సిఎల్ రోజ్, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా  విచ్చేస్తున్నట్లు తెలిపారు. పిఆర్టియు కామారెడ్డి కార్యాలయములో మహాధర్నా గోడ ప్రతులను  తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ కామారెడ్డి జిల్లా చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి గారు సెక్రెటరీ జనరల్ సాయిరెడ్డి టిజీవో, టీఎన్జీవో ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమములో పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.