06-12-2024 02:25:36 AM
నేటి నుంచి లబ్ధిదారుల ఎంపిక: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, డిసెంబర్5(విజయక్రాంతి): ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీమేరకు రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిం చి ఇస్తామని గృహనిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిష్పక్షపాతంగా అర్హులైన లబ్ధిదారులనే ఎంపిక చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు 400 చదరపు అడుగులు తగ్గకుండా నిర్మించాలని, బెడ్‌రూమ్, కిచెన్, హాల్‌తోపాటు బాత్రూమ్ ఉండేలా డిజైన్ చేసుకోవా లని సూచించారు.
లబ్ధిదారుల ఎంపిక గురువారం నుంచి ప్రారంభమవుతుందని తెలిపా రు. ఒక ఏడాదిలో 4.50 లక్షల ఇళ్లు నిర్మించడం దేశంలో తెలంగాణలోనే మాత్ర మే ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను గ్రీన్‌చానల్ ద్వారా 4 విడతల్లో చెల్లింపు లు ఉంటాయని తెలిపారు. బెస్మెంట్ వరకు రూ.లక్ష, రెంటల్ లెవల్‌కు రూ.1.25 లక్షలు, స్లాబ్‌కు రూ.1.75 లక్షలు, ఆ తర్వాత 1 లక్ష చెల్లించనున్నట్లు మంత్రి వివరించారు.