calender_icon.png 22 October, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొత్తం దరఖాస్తులు

20-10-2025 12:00:00 AM

ఆదాయం రూ. 215.64 కోట్లు

23 వరకు గడువు పొడగింపు

27 న డ్రా

కరీంనగర్, అక్టోబరు 19 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్యం పాలసీకి స్పందన కరువయింది. గత సీజన్ కంటే 3500 వరకు దరఖాస్తులు తగ్గాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఎక్సైజ్ శాఖల పరిధిలో మొత్తం 287 మద్యం షాపులకుగాను 7188 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా 215 కోట్ల 64 లక్షల ఆదాయం సమకూరింది. దరఖాస్తులు గత సీజన్ కంటే 3546 తక్కువగా రావడంతో దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పొడగించారు.

లక్కీ డ్రాను ఈ నెల 27న తీయనున్నారు. ఇక కరీంనగర్ జిల్లాలో 94 దుకాణాలకుగాను 2652 వ చ్చాయి. ఇదే కరీంనగర్ జిల్లాలో గత సీజన్లో 4040 దరఖాస్తులు వచ్చాయి. జగిత్యాల జిల్లాలో 71 దుకాణాలకుగాను 1824, పెద్దపల్లి జిల్లాలో 74 దుకాణాలకుగాను 1378, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 48 దుకాణాలకుగాను 1324 దరఖాస్తులు వచ్చాయి. ప్రభు త్వం గతంలో ఉన్న 2 లక్షల రూపాయల దరఖాస్తు ఫీజును 3 లక్షలకు పెంచినప్పటికీ ఆదాయం సమకూర్చుకోవడంలో టార్గెట్ రీచ్ కాలేకపోయింది.

ఆశించిన మేరకు దరఖాస్తులు రాకపోవడంతో లక్ష రూపాయల దరఖాస్తు ఫీజు పెంచినా ఆదాయం గత సీ జన్ లో వచ్చినదానికంటే కోటి రూపాయల పైనే అధికంగా వచ్చింది. చాలా మద్యం దుకాణాలకు 10లోపే దరఖాస్తులు రావ డం, అనుకున్న మేర ఆదాయం రీచ్ కాకపోవడంతో దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పెంచారు. దరఖాస్తుల గడువును పెం చినా గతంలో వచ్చిన దరఖాస్తుల సంఖ్యను రీచ్ కావడం కష్టమే.

23 వరకు వచ్చిన దరఖాస్తులను ఆధారంగా చేసుకుని నాలుగు జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా నిర్వహించి మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఉన్న దుకాణాల గడువు నవంబర్ 30తో ముగియనుంది. డిసెంబర్ 1 నుండి కొత్త మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.