calender_icon.png 22 October, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి

20-10-2025 12:00:00 AM

జిల్లా ఖో ఖో సంఘ అధ్యక్షులు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

ముకరంపురా, అక్టోబర్19(విజయక్రాంతి): ఖో ఖో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కరీంనగర్ జిల్లా ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అం బేద్కర్ స్టేడియంలో జిల్లా ఖో ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి సీనియర్ మహిళలు పురుషుల ఖో ఖో జట్ల ఎంపిక పోటీలను నిర్వహించారు.

ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన సుడా చైర్మన్ క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడల తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. గతంలో జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ చాటి జిల్లా క్రీడ పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించారని మున్ముందు మరింత మంది అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని అన్నారు.

నిత్య శిక్షణతోనే క్రీడల్లో రాణించేందుకు అవకాశాలు ఉంటాయని అన్నారు. జిల్లా యువ జన క్రీడా శాఖ అధికారి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థా యి క్రీడల్లో విజేతలుగా నిలిచేందుకు కృషి చేయాలన్నారు. ఖో ఖో క్రీడలో కరీంనగర్ కు మంచి పేరు ఉందని గుర్తు చేశారు. ఈ పోటీల్లో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా ల నుంచి 225 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరికి ఖో ఖో క్రీడను నిర్వహించి రాష్ట్రస్థాయిలో పాల్గొనే శిక్షణ శిబిరానికి 20 మంది మహిళలను, 20 మంది పురుషుల ను ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ప్రధాన కార్యదర్శి భాషా బోయిన వేణుగోపాల్, జిల్లా ఖో ఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై మహేందర్ రావు, సంఘ ఉపాధ్యక్షులు కరీంనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, కోశాధికా రి చిట్టి తిరుపతిరెడ్డి, జగిత్యాల జిల్లా సంఘ ప్రతినిధి డాక్టర్ ఏ రవీందర్, సిరిసిల్ల జిల్లా సంఘ ప్రతినిధి ఎస్కే మోహినిద్దీన్, కరీంనగర్ జిల్లా సంఘ సభ్యులు వి సూర్యప్రకాష్, కట్ట సంతోష్, వి శ్రీలత, రేణుక, యోగేష్, క రుణాకర్, అశోక్, రాజబాబు, అంతర్జాతీయ ఖో ఖో క్రీడాకారులు పండుగ ఆనంద్, వెంకటేష్, రాజు, జలంధర్, కోచ్ ఈ నరేష్, వ్యా యామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

పోటీల ముగింపు సమావేశానికి పెద్దపల్లి జిల్లా యు వజన క్రీడ శాఖ అధికారి ఏ సురేష్ ,సీనియ ర్ వాలీబాల్ క్రీడాకారుడు ఏ లక్ష్మణ్, మానకొండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ టి రమేష్ లు హాజరై ఎంపికైన క్రీడాకారులనుఅభినందించారు.