calender_icon.png 7 July, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బొగత’లో పర్యాటకుల సందడి

07-07-2025 12:42:02 AM

ములుగు, జూలై 7 (విజయక్రాంతి)/వా జేడు: ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం ఆదివారం పర్యాటకులతో సం దడిగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో హైదరాబాద్, వరంగల్, కరీంన గర్, ములుగు జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బొగత జల పాతం నీటి ధారాలు సందర్శకులకు కను విందు చేస్తున్నది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు వాచ్ టవర్ నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ, జలపాత అందాలను చూసి ముగ్ధులయ్యారు. జలపాత కొలనులో చిన్నారులతో కలిసి స్నానాలు చేస్తూ సంతోషంగా గడిపారు. ఆదివారం వెయ్యి మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు అటవీ అధికారులు వెల్లడించారు.