calender_icon.png 7 July, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎద్దును ఢీకొన్న ‘వందే భారత్’

07-07-2025 12:43:33 AM

  1. తప్పిన పెను ప్రమాదం 

మహబూబాబాద్ జిల్లాలో ఘటన

మహబూబాబాద్, జూలై 6 (విజయక్రాంతి): విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ రైలు ఆదివారం సాయంత్రం మహబూబాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య 428/11 కిలోమీటర్ వద్ద ఎద్దును ఢీ కొట్టింది. రైల్ ఆగిపోవడంతో స్పందించిన రైల్వే అధికారులు అక్కడికి చేరుకొని మృతిచెందిన ఎద్దును తొలగించారు.

ఈ ఘటనలో రైలు ఇంజన్ ముందు భాగంలోని ఫైబర్ షీట్ దెబ్బతిని ఎగిరిపోయింది. రైల్వే పోలీసులు, ఇంజనీరింగ్ అధికారులు అక్కడికి చేరుకుని రైలును పరీక్షించి, పెద్దగా ప్రమాదం ఏది జరగలేదని నిర్ధారించి రైలును తిరిగి పంపించారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్, జీఆర్‌పి అధికారులు విచారణ చేపట్టారు.