calender_icon.png 3 February, 2026 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊహా శక్తిని పెంచే బొమ్మలు!

23-02-2025 12:00:00 AM

పిల్లలకు ఏదైనా విషయాన్ని నేర్పించాలంటే.. కొత్తగానే చెప్పాలి. లేదంటే.. ఇలా విని అలా మర్చిపోతారు. ముఖ్యంగా మూడు.. నాలుగేండ్ల పిల్లలకు పండ్లు, జంతువులు ఎలా ఉంటాయో నేర్పించేందుకు ఇలాంటి టాయ్ ప్రొజెక్టర్లను వాడితే బెటర్. దీంతో ప్రొజెక్ట్ చేసి చూపిస్తే.. సరదాగా అనిపించడంతో బాగా గుర్తుపెట్టుకుంటారు.

దీన్ని ది లిటిల్ వన్స్ కంపెనీ అమ్ముతోంది. ఈ ప్యాక్‌లో ఆరు ప్రొజెక్షన్ డిస్క్‌లు కూడా వస్తాయి. వాటితో.. మొత్తం 48 యానిమేటెడ్ బొమ్మలను ప్రొజెక్ట్ చేయొచ్చు. స్పేస్, డైనోసార్, జంతువులు, సంఖ్యలు, ఫుడ్స్, వెహికల్స్.. ఇలా రకరకాల బొమ్మలు ఉంటాయి.

ఇది పిల్లల్లో నేర్చుకోవాలనే ఆసక్తి, ఊహాశక్తిని పెంచడంలో సాయం చేస్తుంది. దీన్ని హై క్వాలిటీ ఏబీఎస్ ప్లాస్టిక్‌తో తయారుచేశారు. 50 నుంచి 150 సెంటీమీటర్ల వరకు ఇది లైట్‌ని ప్రొజెక్ట్ చేస్తుంది.