05-09-2025 06:48:30 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): అన్నదానం మహాదానం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి అన్నారు. మొండికుంటలోని బొడ్రాయి బజార్‌లో స్థానిక యువజన సంఘం ఆధ్వర్యంలో గణనాథుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా లంభోదరుని నవరాత్రి ఉత్సవాలను ప్రజలు కలసికట్టుగా జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. గణేశుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.