05-05-2025 12:33:09 AM
మహబూబాబాద్, మే 4 (విజయక్రాంతి): రైల్వే ట్రాక్ పై రైళ్లు వెళ్లడం మాత్రమే మనం ఇప్పటివరకు చూసాం. అయితే అందుకు భిన్నంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే ట్రాక్ పై ట్రాక్టర్ పరుగులు పెడుతున్న దృశ్యాన్ని ఆసక్తికరంగా చూస్తున్నారు.
కాజీపేట డోర్నకల్ రైల్వే మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న మూడో లైన్ పనుల్లో వివిధ యంత్రాలతో పాటు రైల్వే ట్రాక్ పై కంకర వేయడానికి ట్రాక్టర్ ఇంజన్, ట్రాలికి టైర్లు తొలగించి ప్రత్యేకంగా ఇనుప చక్రాలను అమర్చి రైల్వే ట్రాక్ పై నడుపుతున్నారు. దీనితో రైల్వే ట్రాక్ పై పరుగులు పెడుతున్న ట్రాక్టర్ ను చూసి ప్రయాణికులు, ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.