05-10-2025 05:25:33 PM
హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. దసరా పండుగ సందర్భంగా లక్షలాది మంది ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లారు. ఇకా సెలవులు ముగియడంతో, స్వస్థలాలకు వెళ్ళిన ప్రజలు తిరిగి హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. దీంతో నగర శివార్లలోని కీసర టోల్ గేట్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడింది. చిట్యాల, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఆర్టీసీ బస్సలు, ప్రైవేట్ వాహనాలు ఒకదాని వెంట ఒకటి బారులు తీరాయి. మరోవైపు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కిక్కిరిసి పోయ్యారు. పోలీసులు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు. వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.