05-10-2025 05:05:42 PM
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడాయి. ఈ ఘటనలో 17 మంది మరణించారని, ఇళ్లు నేలమట్టమయ్యాయని, రోడ్లు దెబ్బతిన్నాయని, అనేక మారుమూల గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఘటనా స్థలాల్లో భద్రతా బలగాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తర బెంగాల్ అభివృద్ధి శాఖ మంత్రి ఉదయన్ గుహ ఇక్కడి పరిస్థితిని ఆందోళనకరంగా అభివర్ణించారు. స్థానిక అధికారుల తెలిపిన ప్రాథమిక నివేదికల ఆధారంగా మృతుల సంఖ్య 17కి చేరిందన్నారు.