05-10-2025 05:36:30 PM
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్యారోగ్యంతో బాధపడుతూ అక్టోబరు 1న గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించిన తెలిసిందే. అయితే ఆయన అస్థికలను వాడపల్లిలోని కృష్ణ, తుంగభద్ర, మూసి సంగమం నదిలో కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఆదివారం నిమజ్జనం చేశారు. వాడపల్లి క్షేత్రంలో కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా కృష్ణానదిలో రాంరెడ్డి అస్తికలను నిమజ్జనం చేశారు.