calender_icon.png 18 October, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహద్దూర్‌ఖాన్‌పేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం

18-10-2025 12:26:23 AM

ముఖ్య అతిథిగా హాజరైన సుడా చైర్మన్ 

కొత్తపల్లి , అక్టోబర్17(విజయక్రాంతి):కరీంనగర్ రూరల్ మండలం బహద్దూర్ ఖాన్ పేట్ లో పూర్తయిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నగరంలోని అన్ని డివిజన్లలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇస్తామని ప్రజా పాలన లో దరఖాస్తు చేసుకుని భూమిఉండి అర్హత కలిగిన వారికి ఏదైనా కారణం చేత ఇల్లు మంజూరు కాకపోతే వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

నియోజక వర్గానికి 3500 ఇళ్లు నిర్మించి ఇస్తామని కరీంనగర్ నియోజక వర్గంలో ఇంకా పూర్తి కాలేదని అర్హులకు అవకాశం ఉందని నరేందర్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అన్నారు.లబ్ది దారులు ఆకుల రమ్య రవీందర్ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల్ అధ్యక్షులు కంరెడ్డి రాంరెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి,గుర్రం బాపురెడ్డి,బూర్గు తిరుపతి గౌడ్,బుర్ర స్వామి గౌడ్,బుర్ర నారాయణ గౌడ్,కూర నరేష్ రెడ్డి,పల్ల ఆంజనేయులు,తప్పట్ల ఆంజనేయులు గ్రామస్థులు తదితరులుపాల్గొన్నారు.