11-05-2025 11:15:01 PM
జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య
ముగిసిన రాష్ట్ర తరగతులు
మంచిర్యాల(విజయక్రాంతి): న్యాయవ్యవస్థలో రోజూ అనేక కొత్త చట్టాలు వస్తున్నాయని, వాటి పట్ల న్యాయవాదులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగిoచడానికి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వృత్తి నైపుణ్య శిక్షణా తరగతులు నిర్వహించడం హర్షనీయమనీ మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులు ఆదివారం ముగుసాయి. ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
న్యాయవాదులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి న్యాయవాదికి క్రమశిక్షణ ముఖ్యమన్నారు. చట్టాలపై అవగాహన లేకుండా వృత్తిలో విజయం సాధించలేరనీ తెలిపారు. సామాజిక బాధ్యతతో న్యాయవాదులు కక్షిదారులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ అధ్యక్షత వహించారు.
తరగతుల నిర్వహణకు సహకరించిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, న్యాయవాది రాజేష్ గౌడ్, అన్ని రకాలుగా సహకరించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల ఏమాజి, జాడి తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి శైలజ, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, సీనియర్ న్యాయవాదులు చిట్ల రమేష్, మల్లారెడ్డి , రాజేష్ గౌడ్, రవీందర్ రావు, గంగయ్య, దత్తాత్రేయ , శిల్ప, వివిధ జిల్లాల న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.