12-05-2025 10:38:09 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆపరేషన్ సింధూర్ కీ సంఘీభావంగా సోమవారం రాత్రి ఆర్యవైశ్య, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి మొదలైన ఈ ర్యాలీ పురవీధుల మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన సాగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.