12-05-2025 10:45:24 PM
ఈ ఏపీ సెట్ లో 283 ర్యాంక్
మహబూబాబాద్,(విజయక్రాంతి): నిరుపేద కుటుంబంలో పుట్టి పూర్తిగా ప్రభుత్వ విద్యాలయాలోనే విద్యనభ్యసించి ఆదివారం ప్రకటించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో 283 ర్యాంకు సాధించి చదువుకు పేద ధనిక భేదం లేదని మరోసారి నిరూపించింది మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన గోసుల అంజనప్రియ. చదువుపై మమకారాన్ని చూసిన తల్లిదండ్రులు రమేష్ రేణుక దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్ కు వెళ్లినప్పటికీ తమ బిడ్డను సొంత ఊరు కోమటిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివించి, అనంతరం ఇంటర్మీడియట్ లో ఖమ్మం ప్రభుత్వ సిఓఈ కళాశాలలో చేర్పించగా ఇంటర్మీడియట్ లో 986 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే ఈఏపీ సెట్ లో అత్యున్నత ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటింది.