calender_icon.png 12 May, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారులో చిన్నారి.. ఊపిరాడక మృతి

11-05-2025 11:10:35 PM

కడ్తాల్: ఇంటి ముందు పార్క్ చేసిన కారులోకి ఓ చిన్నారి ఎక్కి అందులో నిద్రపోయింది. ఈ ఘటనలో అ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంఘటన కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన యాదయ్యకు చెందిన పెద్ద కూతురు అక్షయ (5) వారి సొంతకారులో చర్చికి వెళ్లి తిరిగి ఒంటిగంటకు ఇంటికి చేరుకున్నారు. అందరు కారు దిగిన అనంతరం తర్వాత పెద్ద కూతురు అక్షయ కారు ఎక్కి అందులో పడుకుంది. కారుకు డొరులు వేసి ఉండడంతో ఊపిరి ఆడక మృతి చెందింది. తమ కూతురు కనిపించడంలేదని తల్లిదండ్రులు చుట్టు ముట్టు ఎక్కడ వెతికిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో సాయంత్రం వేళల్లో కారులో చూడగా అప్పటికే అక్షయ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.