22-08-2025 12:07:56 AM
కరీంనగర్, ఆగస్టు 21 (విజయ క్రాంతి): నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మీ టింగ్ హాల్లో గురువారం అంగన్వాడి టీచర్లకు హెచ్‌ఐవి పై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు అందరూ హెచ్‌ఐవి గురించి పూర్తి విధివిధానాలు తెలుసుకొని అది వ్యాప్తి చెందే మార్గాలను,నివారణ చర్యలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసి హెచ్‌ఐవి నిరోధించడంలో ప్రధాన భూమిక వహించాలన్నారు.
అదేవిధంగా హెచ్‌ఐవి పాజిటివ్ వ్యక్తుల పట్ల ఆదరణ చూపాలని వారిని వివక్షకు గురి చేయరాదని తెలిపారు. ఈ కార్యక్ర మంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధా, డాక్టర్ సన జవేరియా, డెమో రాజగోపాల్, సఖి కన్సల్టెంట్ లక్ష్మి, డాప్కో టీం జిల్లా కరీంనగర్ సభ్యులు, అడ్వకేట్ హేమంతా పటేల్, సఖి లీగల్ కౌన్సిలర్ సంధ్యారాణి అంగన్వాడి కార్యకర్తలుపాల్గొన్నారు.