calender_icon.png 23 August, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తుల ఆహ్వానం

22-08-2025 09:10:09 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): వ్యవసాయ యాంత్రికరణ  ఎస్ ఎమ్ ఎ ఎమ్ -2025 లో భాగంగా కొత్తపల్లి మండలానికి సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయని,ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కొత్తపల్లి మండల వ్యవసాయదికారి మామడి కృష్ణ తెలియజేసారు. 115 బ్యాటరీ లేక మాన్యువల్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు,  22 పవర్ స్ప్రేయర్లు, 7 రోటవేటర్లు, 1 సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రిల్లర్లు, 12 డిస్క్ హేరో/కల్టివేటర్/కేజ్ వీల్స్/ఎంబీ ప్లవ్/రోటో పడ్లర్, 1 పవర్ విడర్ ,1 బ్రష్ కట్టర్ ,1 పవర్ టిల్లర్,1 స్ట్రా బెలర్ మొత్తం 161 పనిముట్లు 13.75 లక్షల విలువ కలవి రావడం జరిగిందన్నారు.

 చిన్న, సన్న కారు రైతులకి, మహిళా రైతులకి, ఎస్సీ ఎస్టీ రైతులకు 50% సబ్సిడీ చొప్పున, ఇతర రైతులకి 40% సబ్సిడీ చొప్పున ఇవ్వడం జరుగుతుందని, కావున ఆసక్తిగల రైతులు అప్లికేషన్ ఫామ్, 2 పాస్పోర్ట్  ఫొటోస్, ఆధార్ కార్డు,  ట్రాక్టర్ ఆర్ సి , పట్టాదార్ పాస్ బుక్, చిన్న సన్న కారు రైతు పత్రంలతో ఆయా రైతు వేదికలలో గాని, మండల వ్యవసాయశాఖ అధికారి కార్యాలయంలో ఐన అప్లై చేసుకోవాలని, చివరి తేదీ సెప్టెంబర్ 06 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.