22-08-2025 09:06:23 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ తనయుడు మహమ్మద్ ఇలియాజ్ జన్మదిన సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం అయిందని నిర్వాహకులు డాక్టర్ బాలు, గంప ప్రసాద్ లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను, హెల్మెట్ ను అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు. తన కుమారుని జన్మదినం సందర్భంగా రక్త దానానికి ముందుకు వచ్చిన వారందరూ ప్రాణదాతలే అని అన్నారు.జన్మదినం సందర్భంగా వివిధ మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ రక్తదాన శిబిరంలో 105 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన మహమ్మద్ ఇలియాజ్ కు తలసేమియా సికిల్ సెల్ సొసైటీ పురస్కారాన్ని డాక్టర్ బాలు,జలీల్,గంప ప్రసాద్ లు అందజేశారు.