22-08-2025 07:49:45 PM
మండల వ్యవసాయ శాఖ అధికారి భూమి రెడ్డి
హుజురాబాద్,(విజయక్రాంతి): రాయితీపై రైతులకు యంత్రాలను అందజేస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి చాడ భూమ్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ యాంత్రీకరణపై సబ్- మిషన్ (SMAM) పథకం కింద 2025 -26 అతిక సంవత్సరం గాను రైతులకు రైతుపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించుటకు రైతుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నామని అన్నారు.
ఈ పథకం కింద సన్న, చిన్న కారు, మహిళా రైతులకుst&sc వర్గాల రైతులకు 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40శాతం సబ్సిడీ పై వ్యవసాయ పనిముట్లు అందజేస్తున్నామని తెలిపారు. హుజురాబాద్ మండలంకు బ్యాటరీ పంపులు 170, ప్లేయర్లు 30, రోటోవేటర్లు 12, డిస్క్, ప్లవ్, కేజ్రీల్స్ 15, పవర్ విడర్ 1, పవర్ టిల్లర్ 2, బ్రష్ కట్టర్ 3, గడ్డి చుట్టే యంత్రము1, కేటాయించారని ఆసక్తిగల రైతులు దరఖాస్తు పత్రంతో పాటు ఒక ఫోటో కొత్త పట్టాదారు పాస్ పుస్తకము జిరాక్స్, ఆధార్ జిరాక్స్, డాక్టర్ తో పనిచేయు యంత్రాలకు డాక్టర్ యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలు జత చేసి హుజురాబాద్ వ్యవసాయ కార్యాలయంలో వచ్చేనెల 5వ తేదీ లోపు ఇవ్వాలని కోరారు.