22-08-2025 07:46:12 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని దీని కొరకు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని బీసీలకు న్యాయం చేయాలని శుక్రవారం రోజున స్థానిక రోడ్డు భవనాల అతిథి గృహంలో నాయకులు కే శి పెద్ది శ్రీధర్ రాజు, దొగ్గలి శ్రీధర్, మియాపూర్ రవీంద్ర చారి , మహేష్, రాజు, బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రుద్ర సంతోష్ ను కలిసి విన్నవించడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఆధారంగా స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం దానికి అనుగుణంగా అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లును పంపిన ఇంతవరకు దీనిపై స్పందన లేదు కాంగ్రెస్ ప్రభుత్వమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి బీసీ రిజర్వేషన్లను 42 శాతం సాధించాలని బీసీలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రుద్ర సంతోష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బిసి డిక్లరేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.