22-08-2025 07:38:00 PM
తెలంగాణ నాబార్డ్ సిజిఎం ఉదయ్ భాస్కర్
నకిరేకల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్పివోలు రైతులకు అన్ని రకాల సౌకర్యాలను అందిస్తూ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు అందించడం అభినందనీయమని తెలంగాణ నాబార్డ్ సీజీఎం బి.ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. కట్టంగూరు మండలంలోని ఐటిపాముల గ్రామంలో కట్టంగూరు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ తరపున అయిటిపాములలో నిర్వహిస్తున్న ఇవి ఛార్జింగ్ స్టేషన్ ను ఆఫ్-గ్రిడ్ సోలార్ సిస్టం ఆయన ప్రారంభించారు. ఆయన ఎప్పిఓలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు.
కృషి వికాస్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిరుద్యోగ యువతకు మేలుచేస్తుంది. సోలార్ పవర్ సిస్టం ద్వారా ఇవి వాహనాలకు పెద్దఎత్తున మేలు కలుగుతుందనిఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాణదార ఫౌండేషన్ ప్రతినిధులు కూడా పాల్గొని, రైతులకు డైరెక్ట్ సీడ్ రైస్ (డి ఎస్ ఆర్) పద్ధతిపై సూచనలు అందించారు. రాబోయే రబీ సీజన్‌లో 100 ఎకరాల వరి సాగు కోసం అవసరమైన మిషన్లను ఉచితంగా సేవలు అందజేస్తామని తెలిపారు. ఆరుతడి పంటలతో సాంప్రదాయ సాగుతో పోలిస్తే 3-5 క్వింటాళ్ల వరకు అదనపు దిగుబడి వచ్చే అవకాశం ఉందని వారు వివరించారు.