22-08-2025 07:40:19 PM
నకిరేకల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఊరూరా పనుల జాతర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని గొల్లగూడెం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించే గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటుచేసిన ట్రాన్స్ ఫార్మర్లను ప్రారంభించారు. మండలంలోని కడపర్తి గ్రామంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించే అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.