calender_icon.png 23 August, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలుష్య రహిత వినాయక చవితి నిర్వహించాలి

22-08-2025 08:52:08 PM

నకిరేకల్,(విజయక్రాంతి): వినాయక చవితిని కాలుష్య రహితంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు కనుకుంట్ల విద్యాసాగర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని వివిఎం ఉద్దీపన బివిఎం పాఠశాలలో విద్యార్థులకు బంకమట్టితో వినాయక విగ్రహాలు తయారు చేయడంపై జన విజ్ఞాన వేదిక, పర్యావరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.పర్యావరణానికి హాని కల్గించకుండా ప్రకృతి ప్రసాదించిన బంకమన్ను, సహజ రంగుల తో కూడిన గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి జలాశయాలను, పర్యావరణాన్ని రక్షించుకోవాలన్నారు. కృత్రిమ రంగులు, పిఓపి తో తయారుచేసిన విగ్రహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు.