calender_icon.png 22 August, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి నేతల అరెస్ట్

22-08-2025 07:42:49 PM

వలిగొండ,(విజయక్రాంతి): సెక్రటేరియట్ ముట్టడికి బిజెపి నేతలు తరలి వెళ్తున్నారని సమాచారంతో వెలిగొండ మండల బిజెపి నాయకులను స్థానిక పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్ ముట్టడి అని నెపంతో తనతో పాటు సీనియర్ నాయకులు బంధారపు లింగస్వామి, మండల ఉపాధ్యక్షుడు మందుల నాగరాజు, కీర్తి వెంకటేశంలను ఎలాంటి సమాచారం లేకుండా అక్రమంగా అరెస్టు చేయడం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అణిచివేతకు నిదర్శనం అని  అన్నారు. ఇటువంటి అరెస్టులు  ఎన్ని చేసినా  ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు బిజెపి పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.