calender_icon.png 23 August, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ గ్రామాన ఉపాధి హామీ పనుల జాతర గ్రామ సభలు

22-08-2025 08:56:42 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలయందు శుక్రవారం పనుల జాతర గ్రామసభలు ప్రత్యేక అధికారుల, గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న అన్ని పనులను ప్రారంభించు కోవడం,  గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న వికలాంగులైన కూలీలను  సన్మానించారు. పారిశుద్ధ కార్మికులు మంచి పని చేసిన వారిని గుర్తించి వారిని కూడా శాలువాతో సత్కరించారు.