calender_icon.png 21 September, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిట్స్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ

21-09-2025 07:21:14 PM

కోదాడ: కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల(KITS Womens Engineering College)లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి ఆధ్వర్యంలో బీటెక్ ఈఈఈ సివిల్ ఇంజనీరింగ్ నాలుగవ సంవత్సరం చదువు తున్న విద్యార్థనులకు, టాస్క్ నిపుణులు ఆంథోనీ డిసౌజ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగినది. ఈ శిక్షణ తరగతులలో విద్యార్థినులకు 21వ సెంచరీ ట్రాన్స్ఫారబుల్ స్కిల్స్ పేరిట శిక్షణ ఇవ్వడం జరిగినదని, ఈ శిక్షణ ద్వారా ప్రతి విద్యార్థినికి కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్, అనాలిటికల్ లీడర్ షిప్ స్కిల్స్ పెంచుకునేందుకు ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడు తాయని అన్నారు.  ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ మాట్లాడుతూ , నేటి పోటీ ప్రపంచం లో విద్యార్థినులు వివిధ నైపుణ్యాలను  పెంపొందించుకున్నప్పుడు మాత్రమే ఉన్నత ఉపాధి అవకాశాలు అందుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగాదిపతి శివాజీ, సివిల్ విభాగాదిపతి లక్ష్మణ్ మరియు అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు