21-09-2025 07:13:29 PM
హైదరాబాద్: హన్మకొండ వేయి స్తంభాల ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలు(Bathukamma Festival) తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమయింది. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, సీతక్క హాజరయ్యారు. వేయి స్తంభాల ఆలయ ప్రాంగణం బతుకమ్మ ఆటపాటలతో మారుమ్రోగింది. మహిళలు బతుకమ్మలను తీరొక్క పూలతో అలంకరించి తీసుకొచ్చారు. మంత్రులు కొండ సురేఖ, సీతక్క బతుకమ్మ పాటలు పాడి అలరించారు.