ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ
జేఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్
హైదరాబాద్, జూలై 20(విజయక్రాంతి): రాష్ట్రంలో ఆరుగురు ఏఐఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల ఒకేసారి 20 మంది ఐఏఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసిన సర్కారు.. తాజాగా మరో ఆరుగురికి స్థాన చలనం కలిగించింది. తాజా బదిలీల్లో సీనియర్ ఐఏఎస్ వికాస్‌రాజ్‌ను జేఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. గత బదిలీల్లో వికాస్‌రాజ్‌కు ఎలాంటి పోస్టు ఇవ్వలేదు. ఇప్పుడు ఆయనకు జేడీఏతో పాటు ట్రాన్స్‌పోర్ట్, హౌసింగ్ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. బెనహర్ మహేష్ దత్ ఎక్కాను జేఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్న డాక్టర్ శరత్‌కు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. స్పోర్ట్స్ డైరెక్టర్‌గా ఉన్న కొర్ర లక్ష్మి.. గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీగా బదిలీ అయ్యారు. ఆర్‌అండ్ బీ జాయింట్ సెక్రటరీగా ఉన్న ఎస్ హరీశ్‌కు విపత్తు నిర్వహణ విభాగం స్పెషల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. హన్మకొండ అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న రాధికగుప్తాను మేడ్చల్ అడిషనల్ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది.






