పెద్ద ఎక్ల్లారా నుంచి శబరిమలకు పాదయాత్ర
03-11-2025 01:53 AM
బిచ్కుంద, నవంబర్ 02: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామ నుంచి శబరిమలకు ఆదివారం అయ్యప్ప స్వాములు పాదయాత్రగా తరలి వెళ్లారు. మాదాప్ప గురుస్వామి సోమావార్ నాగ్ నాథ్,సునీల్, జలందర్,సంతోష్ (దెగ్లూర్ )స్వాములు శబరిమలకు పాదయాత్రగా బయలుదేరారు.
అంతకు ముందు హనుమాన్ మందిరం వద్ద గ్రామస్థులు పాదయాత్ర స్వాముల పూజలు చేశారు. 45 రోజుల పాటు 1600 కిలో మీటర్లు పాదయాత్ర చేపడుతున్నట్లు వారు తెలిపారు.అయ్యప్ప స్వాములకు గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సోమావార్ మహేష్ అశోక్ అప్ప భాళి పటేల్ అయ్యప్ప స్వాములను కలసి క్షేమంగా వెళ్లిరావాలని కోరుకున్నారు.






