calender_icon.png 3 November, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ సలహాదారున్ని కలిసిన మాజీ ఎమ్మెల్యే

03-11-2025 01:54:37 AM

గాంధారి, నవంబర్ 2: రాష్ర్ట ప్రభుత్వం నూతన సంక్షేమ పథకాల అమలు యొక్క ప్రభుత్వ సలహాదారునిగా బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ని  నియమించడంతో ఆదివారం రోజున ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు, బాన్సువాడ నియోజకవర్గం ఇన్చార్జ్ ఏనుగు  రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు  ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజాద్ ఖాన్ అన్నారు.

ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం రోజున క్యాబినెట్ రెండో దఫా విస్తరణలో భాగంగా అజారుద్దీన్ కి మంత్రి పదవితో  పాటు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి కి ప్రభుత్వ పథకాల అమలు యొక్క ప్రత్యేక సలహాదారునిగా నియమించడంతో ఆదివారం రోజున ఆయనకు కలిసి  ఆయనకు కలిసిశుభాకాంక్షలు తెలిపి బాన్సువాడ ఎల్లారెడ్డి నియోజకవర్గాల అభివృద్ధి కొరకు నిధులు మంజూరుకు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం నాయకులు అంజద్ ఖాన్, గౌస్ ఖాన్ బాన్సువాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత కృష్ణమూర్తి  తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు