08-08-2025 01:08:11 AM
ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 7 (విజ యక్రాంతి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. గురువారం కలెక్ట రేట్‌లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆసి ఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కోవ లక్ష్మి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమా దేవిలతో కలిసి ఆదివాసీ సంఘాల నాయ కులు, అధికారులతో ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలపై సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు 9 తెగల నాయకులు సహకరించాలని, కార్యక్రమానికి హాజరయ్యే వారికి భోజన వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆదివాసి సంస్కృతిని ప్రపంచా నికి తెలియపరచాలని అన్నారు.
అనంతరం ఆదివాసి దినోత్సవం సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరిం చారు.ఈ కార్యక్రమంలో రాజ్ గోండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు మడావి శ్రీనివాస్, నాయకులు సిడాం అర్జు, కుడ్మెత మారుతి, మడావి నర్సింగ్ రావు, పెందూర్ సుధాకర్, ఆత్రం భీమ్రావు, ఆత్రం సంతోష్, మర్సు కోల సరస్వతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.