08-08-2025 01:08:17 AM
- చేనేత రంగంలో సేవలు అందించిన పలువురి ప్రముఖులకు సన్మానం..
- హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ..
ముషీరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): చేనేత రంగాన్ని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మన అందరిపై ఉన్నదని హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ శ్రమ, నైపుణ్యం, నిబద్ధతతో చేనేత కాలనీ విశ్వవాప్తం చేసి చేనేత రంగంలో విశేష సేవలందించిన పలువురి ప్రముఖులను గురువారం రాంనగర్ లోని ఆయన నివాసంలో బిజెపి అధికార ప్రతినిధి, దత్తాత్రేయ తనయ విజయలక్ష్మి తో కలిసి శాలువాలు పూలమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ చేనేత రంగంలో విశేష సేవలు అందించిన ప్రముఖులను సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సందర్భంగా చేనేత కార్మికులతో పాటు కేవలం సేవలందించిన ప్రముఖులను ఆయ న అభినందించారు. సన్మానించిన వారిలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, పద్మశ్రీ చింతకింది మల్లేశం, సుద్దాల అశోక్ తేజ, గజం గోవర్ధన్, గజం అంజయ్య, కందగట్ల నరసింహ, భోగ సరస్వతి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ య వ్యక్తిగత కార్యదర్శి కైలాస్ నగేష్ పాల్గొన్నారు.