6 August, 2026 | 9:51 PM

Breaking News

సైబరాబాద్‌ కమిషనరేట్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి

06-08-2026 08:58 PM

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనకు జీవితాంతం కృషి చేసిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనమైన నివాళి కార్యక్రమం జరిగింది.ఆయన చిత్రపటానికి పుష్పాంజలి అర్పించి పోలీసు అధికారులు గౌరవం చూపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ ఐపీఎస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ జీవితం తెలంగాణ ప్రజలకు ఆదర్శం అన్నారు.

రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన నిరంతర కృషి, సూత్రాలు, ప్రజలపై ఉన్న అంకితభావం నేటి తరం అందరికీ మార్గదర్శకం కావాలని సూచించారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.