27-07-2025 07:25:23 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ప్రముఖ వైద్యులు తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర నాయకులు దామెర్ రాములు అనే కవికి ఆదివారం సత్కారం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సి.నారాయణరెడ్డి 94వ జయంతిని పురస్కరించుకొని ఈ సత్కారం అందుకున్నారు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్ తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును సత్కారం అందుకున్నట్టు తెలిపారు.