calender_icon.png 27 July, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్‌ షాక్‌తో లైన్‌మెన్ కు తీవ్ర గాయాలు

27-07-2025 07:28:55 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): విద్యుత్‌ షాక్‌తో జూనియర్ లైన్‌మెన్‌కు తీవ్ర గాయాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కొత్తగూడ మండలం కుందనపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని సాదిరెడ్డిపల్లి సబ్ స్టేషన్ లో జూనియర్ లైన్మెన్ గా విధులు నిర్వర్తిస్తున్న లింగాల మహేష్ విధి నిర్వహణలో భాగంగా ఓటాయి ఫీడర్ లోని కుందన పెల్లి గ్రామ రైతు పొలంలో ఉన్న కరెంటు స్తంభం ఎక్కి విద్యుత్ మరమత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై స్తంభం పైనుంచి కిందకు పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని స్థానికులు, విద్యుత్ సిబ్బంది నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏఈ సురేష్, సిబ్బంది ఆసుపత్రికి చేరుకున్నారు. మహేష్ ను మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు.