calender_icon.png 8 September, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ మండప నిర్వహకులకు సన్మానం

08-09-2025 12:00:00 AM

మేడ్చల్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో గణేష్ నిమర్జన సమితి ఆధ్వర్యంలో మండప నిర్వహకులను సన్మానించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహక అధ్యక్షుడు చెరువు కొమ్ము శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ చిన్న పెద్ద తేడా లేకుండా గణేష్ విగ్రహాలు ప్రతిష్టించి తమ ఆధ్యాత్మికతను, భక్తి భావాలను చాటుకున్నారన్నారు. పెద్ద సంఖ్యలో విగ్రహాల ప్రతిష్టించి ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

50 ఏళ్లుగా గణేష్ నిమర్జన సమితి ఆధ్వర్యంలో శోభయాత్రకు స్వాగతం పలుకుతూ నిర్వాహకులను సన్మానిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రామన్న గారి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ తాళ్లపల్లి మురళీధర్ గుప్తా, పాతూరు సుధాకర్ రెడ్డి, డివి కిషన్ రావు, ఆర్ మల్లికార్జున స్వామి, నడికొప్పు బాల మల్లేష్, దాత్రిక లక్ష్మణ్, ముల్లంగిరి శ్రీహరి చారి, నర్సింగ్ ముదిరాజ్, బర్ల సంతోష్ ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్, నర్సింగ్ రజక, లక్ష్మణ్ ప్రభు, పడాల రఘురాం పటేల్, ఉప్పాల యశ్వంత్ పాల్గొన్నారు.