calender_icon.png 8 September, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఈవో కలెక్టర్ ఆగ్రహం

08-09-2025 07:40:05 PM

డిప్యూటీషన వెంటనే రద్దు చేయలని ఆదేశం..!

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): ప్రభుత్వం నియమించిన చోట కాకుండా ఉపాధ్యాయురాలిని  ఎందుకు డిప్యూటేషన్ పై పంపించారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డిఈఓ బిక్షపతి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి మండలం నరసింహుల గూడెం పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలుగా పి రోహిణినీ ప్రభుత్వం నియమించింది. అయితే ప్రధానోపాధ్యాయురాలు రోహిణినీ అనారోగ్యం పేరుతో అక్రమంగా ఓ డి పై మునుగోడు మండలంలోని పులి పలుపుల పాఠశాలకు విద్యాశాఖ అధికారి డిప్యూటేషన్ వేశారు. మా ప్రధానోపాధ్యాయురాలుని మా పాఠశాలకు పంపించాలని, పాఠశాలకు ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులలో ఒకరిని డిప్యూటేషన్ వేయడం వలన ఒక ఉపాధ్యాయులతో ఇబ్బందిగా ఉందని సోమవారం  ఆ పాఠశాలకు చెందిన చిన్నారి విద్యార్థినిలు, గ్రామస్తులైన, ఆంజనేయులు, గణేష్, శంకర్, బిక్షం ,రాజు, నగేష్ లతో కలిసి వచ్చి ప్రజావాణిలో కలెక్టర్ కు ఇలా త్రిపాటి  కి ఫిర్యాదు చేశారు.

దీంతో వెంటనే జిల్లా కలెక్టర్  డీఈఓ బిక్షపతి ని పిలిపించి ఉపాధ్యాయురాలిని  ఎందుకు డిప్యూటేషన్ వేశామని ప్రభుత్వం నియమించిన చోట కాకుండా మీరు ఎందుకు ఆమెను పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఇఓ సమాధానం ఇస్తూ ఆ ఉపాధ్యాయురాలిని గ్రామస్తులు అక్కడ పనిచేయ నీయడం లేదని కలెక్టర్ కు సమాధానమిచ్చారు. కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగులను పనిచేయనియాలని ఎవరు ఇబ్బంది పెట్టకూడదని చెప్తూ వెంటనే డిప్యూటేషన్ రద్దు చేసి నరసింహుల గూడెం పాఠశాల కు ప్రధానోపాధ్యాయురాలు రోహిణి  పంపియాలని కలెక్టర్ డి ఓ ను ఆదేశించారు. విద్యార్థులను ఇలా తిప్పకూడదని కలెక్టర్ గ్రామస్తులతో అంటూ పిల్లలను మంచిగా చదవనీయాలని వారిని ప్రోత్సహిస్తూ చాక్లెట్లు పంపిణీ చేశారు.