08-09-2025 07:04:06 PM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఈవిఎం లను భద్రపరిచిన గోదామును త్రైమాసిక తనిఖీలలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాము సీలు తెరిచి గోదాములో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల బాక్సులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. గోదాము వద్ద సి. సి. కెమెరాల ద్వారా 24 గంటలు పర్యవేక్షించడం జరుగుతుందని, పటిష్టమైన పోలీస్ భద్రత ఉందని, అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.